Tuesday 18 February 2014

NAVA NAGA NAMA STOTRAM IN TELUGU

                                  నవనాగ నామ స్తోత్రం                      

అనంతం  వాసుకిం  శేషం    పద్మనాభంచకంబలమ్
శంఖపాలం ధార్తరాష్ట్రం  తక్షకం  కాళీయం  తధా
 ఏతాని  నవ  నామాని  నాగానాంచ   మాహాత్మనాం
సాయంకాలే   పఠేనిత్యం   ప్రాతః  కాలే  విశేషతః
తస్మై విషభయం   నాస్తి  సర్వత్ర  విజయీ  భవేత్                           

 

Durga Dwathrimsa Nama Mala in telugu

                               శ్రీ  దుర్గా ద్వాత్రింశన్నామ  మాలా

   Those who read these 32 names of DurgaDevi daily without any doubt will certainly overcome all the difficulties and fears in their life. This Slokam is from Durga Sapthasati.

 ఈ  శ్లోకం  చాలా  శక్తిమంతమయిన  శ్లోకం. దుర్గాదేవికి  సంభందించిన 32 నామాలు  ఇందులో  ఉన్నాయి .  ఈ  శ్లోకం  దుర్గాసప్తసతి  లో  కనిపిస్తుంది . ఈ  శ్లోకాన్ని ఎవరు   రోజూ  చదువుతారో  వారు  అన్ని భయాలనుంచీ    కష్ఠాలనుంచీ  విముక్తులవుతారు. మా విషయంలోకూడా  ఇది  నిజమయింది. అందరూ  తప్పకుండా  నమ్మకం  తో  చదవండి

దుర్గా  దుర్గార్తి  శమనీ   దుర్గాపద్వినివారిణీ
దుర్గచ్ఛేదినీ  దుర్గసాధినీ  దుర్గనాశినీ
ఓం దుర్గతోద్ధారిణీ   దుర్గనిహంత్రీ   దుర్గమాపహా 
ఓం దుర్గమజ్ఞానదా దుర్గ దైత్య లోక   దవానలా
ఓం దుర్గ  మాదుర్గమాలోకా   దుర్గమాత్మ  స్వరూపిణీ
ఓం దుర్గమార్గప్రదా   దుర్గమవిద్యా  దుర్గమాశ్రితా
ఓం దుర్గమ  జ్ఞాన  సంస్థానా  దుర్గమ  ధ్యాన  భాసినీ
ఓం దుర్గ  మోహాదుర్గ  మాదుర్గమార్ధ  స్వరూపిణీ
ఓం దుర్గ  మాసుర  సంహంర్త్రీ    దుర్గమాయుధధారిణీ
ఓం దుర్గమాంగీ  దుర్గమాతా  దుర్గమాదుర్గమేశ్వరీ
ఓం దుర్గభీమా దుర్గభామా దుర్లభా  దుర్గ  దారిణీ
నామావళి   మిమాం  యస్తు దుర్గాయా  మమ మానవః
 పఠేత్సర్వ  భయాన్ముక్తో  భవిష్యతి  నసంశయః  

 

Saturday 8 February 2014

Manasa Devi Slokam For Kalasarpa Dosha Nivarana


మానసాదేవి ద్వాదశనామస్తొత్రమ్ 
ఈ శ్లోకం ఎవరు  రోజు చదువుతారో వారికి సర్ప భయం ఉండదు . కాలసర్ప దోషం భాధించదు .

శ్లోకం
జరత్కారు  జగద్గౌరీ  మానసా  సిద్ధయోగినీ
వైష్ణవీ నాగభగినీ  శైవీ  నాగేశ్వరీ  తథా
జరత్కారుప్రియా  స్తీకమాతా  విషహరేతి  చ
మహాజ్ఞానయుతా   చైవ  సా  దేవీ  విశ్వపూజితా
ద్వాదశైతాని   నామాని  పుజాకాలేతు యఃపఠేత్   
తస్య నాగభయం  నాస్తి  తస్య  వంశోద్భవస్య  చ   

మానసాదేవిమంత్రం
" ఓం  హ్రీం శ్రీం  క్లీం  ఐం మానసాదేవ్యై స్వాహా" 


మానసాదేవి చరిత్ర 
మానసా దేవి వాసుకి   చెల్లెలు . వాసుకి జనమేజయుడు  చేస్తున్న సర్పయాగంలో సర్పాలు మరణి స్తునపుడు,    మానసాదేవిని తన కుమారుడైన అస్తీకుని తో చెప్పి  నాగజాతిని కాపాడమని కోరతాడు .మానసా దేవి ఆదేశానుసారం అస్తీకుడు     ఆ యాగాన్ని  ఆపి సర్పజాతిని  కాపాడతాడు .వారు అస్తీకుడు   కృతజ్ఞతలు తెలుపుతారు.అప్పుడు అస్తీకుడు వాసుకి తొ నేను నా తల్లి తపస్సు వల్ల ,అశీస్సులువల్ల ఈ పని సాధించాను అని చెబుతాడు . అప్పుడు ఇంద్రుడు అది నిజమని  పలికి. అమ్మ జరత్కారు ! నీవు  జగన్మాత అయిన లక్ష్మీదేవి అంస తో ఉదయించి ,పూర్వ జన్మలో మమహాతపస్సు  చేశావు .హరిహరులు నీ  తపస్సు కు సంతోషించి "సిథేశ్వరి" గా నీకు వరములు ప్రసాదించారు .ఆనాడు  దేవతలకు నీవు ఎన్నో ఉపకారాలు చేశావు.నన్ను   కూడా    నీవు రక్షించావు .  నీ  భర్త  అయిన జరత్కారు మునీశ్వరుడిని (ఆయనలో నారాయణ అంశ వున్నది) యంతో భక్తితో    సేవించి  ఈ అస్తీకుడిని వరప్రసాదంగా కన్నావు .దేవతలయందు ఆర్తుల యందు,ధర్మరక్షనయందు మనసు పెట్టినమాతగా నిన్ను "మానసాదేవి " అని   పిలిచేవారము .ఆ పేరు ఇప్పుడు కూడా  సార్ధకమైనది. ఆపదలోవున్న నాగజతిని కాపాడి  నాగపూజ్యవే  కాదు లోకపూజ్యవు  కూడా  అయినావు. ఈ నాటినుండి నిన్ను పూజించేవారు సమస్త  కామ్యములను పొందుతారు .నీ నామములను ఎవరు పఠిస్తారో  వారికి సర్ప భయం  వుండదు  అంటూ  లొకపాలకుడైన ఇంద్రుడు మానసాదేవి నామములను స్తుతించాడు . నాగ ప్రముఖులందరూ    మానసాదేవిని భక్తితో  పూజించారు.గంగాతీరంలోని "మాయాపురి" దగ్గర వున్న కొండపైన అస్తీకుని ఆశ్రమంలో  మానసాదేవి అందరిచేత పూజలు  అందుకుంటుున్నది. ఈ గుడి హరిద్వార్ దగ్గర వుంది .    

Wednesday 5 February 2014

Vivaha Mantra

 వివాహం  కోసం చదవలసిన మంత్రం
  
ఓం  దేవేంద్రాణి  నమస్తుభ్యం   దేవేంద్ర  ప్రియభామిని
 వివాహం భాగ్యమారోగ్యం శీఘ్రలాభంచ  దేహిమే 

విధివిధానము
ఈ  మంత్రమును రోజుకి 108 సార్లు ,21రోజులు చదవాలి .దీనివలన  మరీ  ఆలస్యం అయిన వివాహాలు జరుగుతాయి .     
Related Posts Plugin for WordPress, Blogger...