Saturday, 8 February 2014

Manasa Devi Slokam For Kalasarpa Dosha Nivarana


మానసాదేవి ద్వాదశనామస్తొత్రమ్ 
ఈ శ్లోకం ఎవరు  రోజు చదువుతారో వారికి సర్ప భయం ఉండదు . కాలసర్ప దోషం భాధించదు .

శ్లోకం
జరత్కారు  జగద్గౌరీ  మానసా  సిద్ధయోగినీ
వైష్ణవీ నాగభగినీ  శైవీ  నాగేశ్వరీ  తథా
జరత్కారుప్రియా  స్తీకమాతా  విషహరేతి  చ
మహాజ్ఞానయుతా   చైవ  సా  దేవీ  విశ్వపూజితా
ద్వాదశైతాని   నామాని  పుజాకాలేతు యఃపఠేత్   
తస్య నాగభయం  నాస్తి  తస్య  వంశోద్భవస్య  చ   

మానసాదేవిమంత్రం
" ఓం  హ్రీం శ్రీం  క్లీం  ఐం మానసాదేవ్యై స్వాహా" 


మానసాదేవి చరిత్ర 
మానసా దేవి వాసుకి   చెల్లెలు . వాసుకి జనమేజయుడు  చేస్తున్న సర్పయాగంలో సర్పాలు మరణి స్తునపుడు,    మానసాదేవిని తన కుమారుడైన అస్తీకుని తో చెప్పి  నాగజాతిని కాపాడమని కోరతాడు .మానసా దేవి ఆదేశానుసారం అస్తీకుడు     ఆ యాగాన్ని  ఆపి సర్పజాతిని  కాపాడతాడు .వారు అస్తీకుడు   కృతజ్ఞతలు తెలుపుతారు.అప్పుడు అస్తీకుడు వాసుకి తొ నేను నా తల్లి తపస్సు వల్ల ,అశీస్సులువల్ల ఈ పని సాధించాను అని చెబుతాడు . అప్పుడు ఇంద్రుడు అది నిజమని  పలికి. అమ్మ జరత్కారు ! నీవు  జగన్మాత అయిన లక్ష్మీదేవి అంస తో ఉదయించి ,పూర్వ జన్మలో మమహాతపస్సు  చేశావు .హరిహరులు నీ  తపస్సు కు సంతోషించి "సిథేశ్వరి" గా నీకు వరములు ప్రసాదించారు .ఆనాడు  దేవతలకు నీవు ఎన్నో ఉపకారాలు చేశావు.నన్ను   కూడా    నీవు రక్షించావు .  నీ  భర్త  అయిన జరత్కారు మునీశ్వరుడిని (ఆయనలో నారాయణ అంశ వున్నది) యంతో భక్తితో    సేవించి  ఈ అస్తీకుడిని వరప్రసాదంగా కన్నావు .దేవతలయందు ఆర్తుల యందు,ధర్మరక్షనయందు మనసు పెట్టినమాతగా నిన్ను "మానసాదేవి " అని   పిలిచేవారము .ఆ పేరు ఇప్పుడు కూడా  సార్ధకమైనది. ఆపదలోవున్న నాగజతిని కాపాడి  నాగపూజ్యవే  కాదు లోకపూజ్యవు  కూడా  అయినావు. ఈ నాటినుండి నిన్ను పూజించేవారు సమస్త  కామ్యములను పొందుతారు .నీ నామములను ఎవరు పఠిస్తారో  వారికి సర్ప భయం  వుండదు  అంటూ  లొకపాలకుడైన ఇంద్రుడు మానసాదేవి నామములను స్తుతించాడు . నాగ ప్రముఖులందరూ    మానసాదేవిని భక్తితో  పూజించారు.గంగాతీరంలోని "మాయాపురి" దగ్గర వున్న కొండపైన అస్తీకుని ఆశ్రమంలో  మానసాదేవి అందరిచేత పూజలు  అందుకుంటుున్నది. ఈ గుడి హరిద్వార్ దగ్గర వుంది .    
Related Posts Plugin for WordPress, Blogger...